భగభగ మండుతున్న ఎండలు - కర్నూలు జిల్లాలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత
కర్నూలు, 07 మే (హి.స.)రాష్ట్రంలో సూర్యుడి భగభగతో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ప్రారంభమైన ఎండల దడ ఇప్పుడు ఏప్రిల్ మాసంలో భయపెట్టిస్తోంది. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి అంతటా నెలకొంది. దాంతో రానున్న మే నెలలో పరిస్థితి ఇంకెంత తీవ
/intense-heat-in-ap-morethan-44-degrees-temperature-recorded-in-kur


కర్నూలు, 07 మే (హి.స.)రాష్ట్రంలో సూర్యుడి భగభగతో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ప్రారంభమైన ఎండల దడ ఇప్పుడు ఏప్రిల్ మాసంలో భయపెట్టిస్తోంది. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి అంతటా నెలకొంది. దాంతో రానున్న మే నెలలో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడి భగభగతో పగటిపూట ఆరు బయట కాలు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండల వల్ల మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ రహదారులపై జనసంచారం తక్కువగా కనిపిస్తోంది. ఆదివారం రాష్ట్రంలో 23 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నగర వాసులు ఉక్కిరిబిక్కిరి: పగటిపూట ప్రయాణించేవారు టోపీలు, మాస్కులు, మహిళలైతే ముఖానికి వస్త్రాలు రక్షణగా ధరిస్తున్నారు. ఇక విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు ఎండలోనే ప్రయాణిస్తున్నారు. కొందరు వేసవి నుంచి ఉపశమనం కోసం చలివేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కొందరు కొబ్బరి బోండాలు, శీతల పానీయాల బళ్ల వద్దకు చేరుతున్నారు. భూతాపంతో ఎండలు ఎక్కువగా ఉండే విజయవాడ వంటి ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నగర వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఉపశమనం పొందేందుకు: ఎండాకాలంలో ఎక్కడెక్కడో పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి అలసట వచ్చేస్తుంది. చిన్న చిన్న పనులకే నీరస పడిపోతుంటాం. అలవాటు ఉన్న వాళ్లు అలసట బారి నుంచి ఉపశమనం పొందడానికి టీ, కాఫీ తీసుకుంటారు. కానీ వేసవిలో వేడి పదార్థాలు పెద్దగా రుచించవు. కాస్త చల్లచల్లగా ఏవైనా పళ్లరసాలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సహజ పానీయాలైన పళ్ల రసాలను తీసుకోవడమే మంచిదని, తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని, అలసట దూరమవుతుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande