
అనంతపురం, 07 మే (హి.స.)
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన, విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ దర్శనం ద్వారా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV