సీఎం చంద్రబాబు నాయుడు.రేపు కోలకతా పర్యటన కు. వెళ్లనున్నారు
అమరావతి, 08 మే (హి.స.) :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడురేపు (శనివారం) కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. దేశవ్యాప్తంగా వి
సీఎం చంద్రబాబు నాయుడు.రేపు కోలకతా పర్యటన కు. వెళ్లనున్నారు


అమరావతి, 08 మే (హి.స.)

:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడురేపు (శనివారం) కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో చంద్రబాబు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సీఎం చంద్రబాబు రేపు ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. రేపు ఉదయం 7:40 గంటలకు విజయవాడ నుంచి కోల్కతాకు విమానంలో బయలుదేరనున్నారు. సీఎం చంద్రబాబు ప్రయాణానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:20 గంటలకు కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్కు వెళ్లనున్నారు. ఈ ప్రాంగణంలోనే పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు సీఎం చంద్రబాబు కోల్కతా నుంచి తిరిగి బయలుదేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:45 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande