
అమరావతి, 08 మే (హి.స.)
పెన్షన్స్పై తమ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతుందని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)వ్యాఖ్యానించారు. ఆయా సమస్యల పరిష్కరానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని చెప్పుకొచ్చారు. తాము హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని ఒక్కొక్కటిగా అమలు చేశామని వెల్లడించారు. ప్రజలంతా ఇది మంచి ప్రభుత్వమని అంటున్నారని తెలిపారు. ఈరోజు (శుక్రవారం) విజయవాడలోని 45వ డివిజన్ ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎంపీ శివనాథ్ పాల్గొని మాట్లాడారు. జగన్ హయాంలో నేతలు, అధికారులు ఎవరు ప్రజల దగ్గరకు వెళ్లింది లేదని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సూచనల మేరకు ఈ ప్రజాదర్భార్ కార్యక్రమం జరుగుతుందని ఎంపీ శివనాథ్ వివరించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. విజయవాడలోని సమస్యలు అన్నింటిపై జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులం కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా సమస్యలు అన్నిటింపై స్పందించారని తెలిపారు. జీవో నంబర్ 30 తీసుకువచ్చి ప్రతి ఒక్క లబ్దిదారుడుకి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. విజయవాడలో డ్రైనేజి, కొండ ప్రాంత ప్రజల సమస్యలు త్వరలో తీరాబోతున్నాయని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.
In.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ