సోషల్ మీడియా ఫేక్ న్యూస్లో ఏపీ టాప్.. పెరిగిన సైబర్ నేరాలు!
సోషల్ మీడియా ఫేక్ న్యూస్లో ఏపీ టాప్.. పెరిగిన సైబర్ నేరాలు!
Fake news


హైదరాబాద్, 08 మే (హి.స.)

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 2024 నివేదికలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేరాల తీరుపై సంచలన విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా సాగుతున్న తప్పుడు ప్రచారాలు (Fake News), సైబర్ నేరాలు, హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, ప్రచారాలు చేస్తున్న కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి వరుసలో నిలిచింది. 2024లో ఏపీలో 203 ఫేక్ న్యూస్ కేసులు నమోదు కాగా, తెలంగాణలో 139 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక మరోవైపు ఏపీలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగినట్లుగా నివేదిక చెబుతోంది. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 2,528 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాల రేటు 8 శాతం పెరగడం గమనార్హం.

రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే హింసాత్మక నేరాలు భారీగా పెరిగాయి. 2024లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 11,66,076 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకు గాను ప్రస్తుతం కేవలం 13 యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (AHTUs) మాత్రమే పనిచేస్తున్నాయి. అక్రమ రవాణాను అరికట్టాలంటే ఈ యూనిట్లను అన్ని జిల్లాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande