
జనగామ, 08 మే (హి.స.)
జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని,
సమగ్ర సమాచారం దేశాభివృద్ధికి పునాది అవుతుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి నెహ్రూ పార్క్ వరకు నిర్వహించిన జనగణన అవగాహన వాక్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ అవగాహన వాక్ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జనగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ కడకంచి బాలమణి, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీయ గణన ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఐదు వేల మంది స్వీయ నమోదు చేసుకున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.
మే 11 నుంచి ఇళ్ల గణన ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇందులో మొత్తం 34 ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. ప్రజలు అందించే వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయని, ఎలాంటి భయం లేకుండా పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జనగణనపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన వాక్లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..