
అమరావతి, 08 మే (హి.స.)
, : ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లోనే పూర్తికానుంది. ప్రస్తుతం వాహనానికి డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేశాక.. దానికి రవాణా శాఖ అధికారులు ఆమోదం తెలిపి, శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇటీవల ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చింది. ఎటువంటి జాప్యాలు లేకుండా, వాహనదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాంతో రవాణా శాఖ ఇప్పుడు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. దీనికి ప్రభుత్వం ఈ వారంలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రమంతటా దాదాపు 27 వేల వాహనాలు శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. నిర్ణీత గడువు లేకపోవడమే దీనికి కారణం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ