

ఆలూరు , 08 మే (హి.స.)
ఆదోని లక్ష్మమ్మవ్వ జన్మస్థలమైన ఆలూరు మండలం మూసనహళ్లి గ్రామంలో లక్ష్మమ్మవ్వ రథోత్సవాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం లక్ష్మమ్మవ్వ దేవాలయంలో గంగపూజ, పుష్పాలంకరణ, మహా మంగళ మారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహాయోగి లక్ష్మమ్మ అవ్వ పుట్టినిల్లు అయిన చాగి గ్రామస్థులు, అర్థరాత్రి నుండే గ్రామం నుండి ఊరేగింపుగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అవ్వకు మహా మంగళ హారతి, కుంకుమార్చన, పూజలు ఆలయ పూజారులు నిర్వహించారు.ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో, పూలతో ముస్తాబు చేశారు. అవ్వ గర్భ గుడి, జీవ సమాధిని ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారు జామున 3 గంటల నుండి అవ్వకు మొక్కుబడులు తీర్చుకునేందుకు భక్తులు కొలువుదీరారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు.ఎస్ఐ మన్మథవిజయ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV