
అనంతపురం, 08 మే (హి.స.)
పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులకు హజరుకావాలని అనంతపురం జిల్లా కూడేరు డీఈవో ప్రసాద్రావు సూచించారు. ఆయన ఈ రోజు కూడేరు మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను హెచఎంను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని అన్ని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల్లో తరగతులు జరుగుతున్నాయని, తక్కువ మంది విద్యార్థులున్న చోట దగ్గరలోని పాళశాలకు వెళ్లి చదువుకోవాలన్నారు. ప్రభుత్వం స్టడీ మెటీరియల్ సరఫరా చేసిందని, ఈ నెల 25 వరకు విద్యార్థులకు తరగతులు జరుగుతాయని తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చదువులు చెప్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతులకు హజరుకాని ఫెయిల్ అయిన విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఫోనలో మాట్లాడటంతో పాటు వారి ఇళ్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని డీఈవో తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV