స్వీయ గణనకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం.. నల్గొండ జిల్లా కలెక్టర్
స్వీయ గణనకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం.. నల్గొండ జిల్లా కలెక్టర్
Collector


నల్గొండ, 08 మే (హి.స.)

2027 జనగణన లో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. స్వీయ జనగణన పై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవారం ముఖ్య ప్రణాళిక అధికారి, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన జనగణన నడకను కలెక్టర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిలు ఎన్ జి కళాశాల వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 2027 జనగణంలో భాగంగా ముందుగా స్వీయ గణన, గృహాల లెక్కింపు ; జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల 26 నుంచి ప్రారంభమైన స్వీయ గణన ఈనెల 10 తో ముగుస్తుందని, జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణనలో పాల్గొనాలని వారి వివరాలన్నింటిని ఇవ్వాలని కోరారు. ఇంటిలో నుండే స్వీయ గణన చేసుకోవచ్చని, 16 భాషల్లోగణన చేసుకునేందుకు అవకాశం ఉందని, మొబైల్ లొనే స్వీయ గణన చేసుకోవచ్చని, ఇది చాలా సులభమని తెలిపారు. ఈ నెల 11 నుంచి ఎన్యుమరేటర్లు ఇల్లిల్లు తిరిగి హౌస్ లిస్టింగ్ చేస్తారని చెప్పారు. దేశ ప్రణాళిక, భవిష్యత్తు అభివృద్ధి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు జనగణన ఉపయోగపడుతుందని అన్నారు.

. జనగణన జనాభా లెక్కలకు తప్ప ఇతర దేనికి ఉపయోగించడం జరగదని, అందువల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇంట్లో ఉన్న వారందరి వివరాలను తెలియజేయాలని, కుటుంబానికి ఒక ఎన్యుమరేషన్ ఐడి వస్తుందని, దీని ఆధారంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు జనగణన జాప్యం లేకుండా త్వరత్వరగా చేసుకునేందుకు వీలవుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande