
శ్రీకాళహస్తి, 08 మే (హి.స.)మధ్యప్రదేశ్ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కైలాష్ విజయవర్గియ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి బీకే వెంకటేశులు ఆయనకు స్వాగతం పలికి, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV