
తిరుమల, 08 మే (హి.స.)
తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరిలో టోకెన్లు లేనివారికి స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి శ్రీవారి దర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. కొత్తగా క్యూలైన్ల లోకి వెళ్లేవారికి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చని టీటీడీ తెలిపింది. ఇక నిన్న (గురువారం) స్వామివారిని 70,001 మంది భక్తులు దర్శించుకోగా.. 30,085 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు సమకూరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV