విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి పై మరో అద్భుతం
విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి పై మరో అద్భుతం
విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి పై మరో అద్భుతం


అమరావతి, 09 మే (హి.స.)

విశాఖపట్నం,:విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై మరో అద్భుతం ఆవిష్కృమైంది. ఢమరుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈరోజు(శనివారం) ఉదయం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ భారీ త్రిశూలంను ప్రారంభించారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో త్రిశూలం ప్రాజెక్ట్ను చేపట్టారు. మూడు కోట్ల రూపాయల వ్యయంతో త్రిశూలం ప్రాజెక్ట్ను నిర్మించారు.

విశాఖ నగరంలో ఎక్కడి నుంచి కైలాసగిరి వైపు చూసినా స్పష్టంగా కనిపించేలా 65 అడుగుల ఎత్తున్న త్రిశూలంను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో కూడా ఆకర్షణీయంగా కనిపించేందుకు 100 వాట్స్ సామర్థ్యం గల 90 ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఈ ప్రాజెక్ట్ను కేవలం 8 నెలల్లో పూర్తి చేసి ప్రజలు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వీఎంఆర్డీఏ అధికారులు తెలిపారు. త్రిశూలం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande