
నాగులుప్పలపాడు, 09 మే (హి.స.)
: నాగులుప్పలపాడు మండలం కొత్తకోట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. వేద పండితులు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ ఆంజనేయ స్వామి విగ్రహం, ఆలయ శిఖరం, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణమంతా శ్రీరామ, గోవింద నామస్మరణలతో మారుమోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ