నకిలీ.డాక్యుమెంట్స్ కేసులో మాజీ.మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కి నెల్లూరు కోర్టులో చుక్కెదురు
నకిలీ.డాక్యుమెంట్స్ కేసులో మాజీ.మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కి నెల్లూరు కోర్టులో చుక్కెదురు
నకిలీ.డాక్యుమెంట్స్ కేసులో మాజీ.మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కి నెల్లూరు కోర్టులో చుక్కెదురు

నెల్లూరు 09 మే (హి.స.)

నకిలీ డాక్యుమెంట్ల కేసులో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు వివరాలను మూడు రోజుల్లోగా విజయవాడ కోర్టుకు పంపాలని నెల్లూరు నగర నాల్గవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ర్టేట్ షేక్ నిషాద్ నాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ (టీడీపీ) కుటుంబానికి విదేశాల్లో రూ.వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కాకాణి గోవర్ధన్రెడ్డి వాటిని మీడియా ఎదుట ప్రదర్శించారు. దీంతో సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాకాణి సుప్రీంకోర్టులో కండిషన్ బెయిల్ తెచ్చుకున్నారు. ఇదే కేసులో కీలక ఆధారాలు కోర్టు భవనంలోనే చోరీకి గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. చివరకు ఈ కేసును చిల్లర దొంగలపైకి నెట్టి కాకాణి తప్పించుకున్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande