ఆదోని. ఇలవేల్పు మహా యోగి. లక్ష్మమ్మ 94 వ జాతర
ఆదోని. ఇలవేల్పు మహా యోగి. లక్ష్మమ్మ 94 వ జాతర
ఆదోని. ఇలవేల్పు మహా యోగి. లక్ష్మమ్మ 94 వ జాతర


ఆదోని, 09 మే (హి.స.)

ఆదోని ఇలవేల్పు మహాయోగి లక్ష్మమ్మ 94వ జాతర మహోత్సవం శనివారం వైభవంగా సాగింది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం భక్తజన సందోహం మధ్య అమ్మవారి వెండి రథోత్సవం జయజయధ్వనాల మధ్య భక్తులు లాగారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే డా. పార్థసారథి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు కట్టిదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande