.వీ ఎం ఆర్.డీ ఏ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై పురపాలక మంత్రి నారాయణ సమీక్ష
.వీ ఎం ఆర్.డీ ఏ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై పురపాలక మంత్రి నారాయణ సమీక్ష
.వీ ఎం ఆర్.డీ ఏ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై పురపాలక మంత్రి నారాయణ సమీక్ష


విశాఖపట్నం, 09 మే (హి.స.)

, వీఎంఆర్డీఏ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్పై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్పై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నగరం అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ అవసరమని ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామమని మంత్రి వెల్లడించారు.

'నగరం అభివృద్ధి చెందాలి అంటే మాస్టర్ ప్లాన్ అవసరం. 6,836 చదరపు కి.మీ పరిధిలో వీఎంఆర్డీఏ ఉంది. 4,387.36 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. మిగిలిన ప్రాంతంలో రానున్న అక్టోబర్ నెలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాం. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై వచ్చిన వినతులపై సమీక్షలో చర్చ జరిపాం. ఎమ్మెల్యేలు తీసుకువచ్చిన వినతులు 90 శాతం పైగా పరిష్కారం చూపాం. 2021లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ను రీవిజిట్ చేయాలని ప్రజా ప్రతినిధులు సీఎంను కోరారు. దీనిపై భారీ ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. తొలుత 3720 అభ్యంతరాలు రాగా రెండవ సారి 1236 అభ్యంతరాలు వచ్చాయి. సమీక్షకు హాజరుకాని ఎమ్మెల్యేలతో చర్చించి మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తాం' అని మంత్రి నారాయణ తెలిపారు.

'హైదరాబాద్ తరహాలో విశాఖలో సెమి రింగ్ రోడ్డు నిర్మించాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కి.మీ మేర సెమి రింగ్ రోడ్డు నిర్మాణం. ఈనెల చివరికి సెమి రింగ్ రోడ్డు డీపీఆర్ సిద్ధం అవుతుంది. అలానే భోగాపురం విమానాశ్రయంకు బీచ్ కారిడార్ ప్రతిపాదన ఉంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రాపర్టీ టాక్స్ విషయంలో పాత విధానాన్ని కొనసాగిస్తున్నాం' అని మంత్రి నారాయణ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande