అనకాపల్లి మండలం. వెంకుపాలేనికి చెందిన ఆర్మీ ఉద్యోగి పూర్ణ చంద్రశేఖర్ మృతి
అనకాపల్లి మండలం. వెంకుపాలేనికి చెందిన ఆర్మీ ఉద్యోగి పూర్ణ చంద్రశేఖర్ మృతి
అనకాపల్లి మండలం. వెంకుపాలేనికి చెందిన ఆర్మీ ఉద్యోగి పూర్ణ చంద్రశేఖర్ మృతి

అనకాపల్లి, 09 మే (హి.స.)

అనకాపల్లి మండలం వెంకుపాలేనికి చెందిన ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణ చంద్రశేఖర్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. దెహ్రాదూన్లో శుక్రవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా.. బలమైన ఇనుప రాడ్డు మీదపడి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.. జవాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దెహ్రాడూన్ నుంచి స్వగ్రామానికి జవాన్ చంద్రశేఖర్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అధికారులతో మాట్లాడి ఏర్పా్ట్లు చేస్తున్నారు. జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర శెట్టి రామకృష్ణ, జనసైనికులు వెంకుపాలెం గ్రామానికి చేరుకుని జవాన్ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande