
అమరావతి, 09 మే (హి.స.): సీఎం చంద్రబాబు 11వ తేదీన(సోమవారం) ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ జరిగే భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కూడా ఆయన కలుస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీపై పునఃసమీక్షించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ను నియమించాలని సీఎం ఆయన్ను కోరనున్నారు. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టును నిరోధించాలని, కృష్ణా నదిపై ఆల్మటి డ్యాం నీటి నిల్వను 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచాలన్న కర్ణాటక ప్రయత్నాలను కూడా అడ్డుకోవాలని అభ్యర్థిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ