నేడు కరీంనగర్ బంద్.. మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్
నేడు కరీంనగర్ బంద్.. మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్
కరీంనగర్ బంద్


కరీంనగర్, 09 మే (హి.స.)

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ వివాదంతో నేడు కరీంనగర్ నగరం బంద్ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలో స్థానిక మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బందులో పాల్గొనకుండా పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. దీంతోపాటు నగరంలోని పలువురు నాయకులు కార్పొరేటర్లను ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నాయకులు సైతం ప్రజలు ఎవరు బంద్ పాటించవద్దని యధావిధిగా వాణిజ్య వ్యాపారాలు కొనసాగించాలని ప్రజలను కోరుతూ వస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande