ఫోర్త్ సిటీపై రేవంత్ రెడ్డికి ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
ఫోర్త్ సిటీపై రేవంత్ రెడ్డికి ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
Jeevan Reddy


కరీంనగర్, 09 మే (హి.స.)

సీనియర్ నేత జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలపై విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లతో కలిసి శనివారం మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. జీవన్ మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ మొదలుకొని ఫోర్త్ సిటీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలో చేసిన రైతు డిక్లరేషన్ నీటి మూటలుగా మారిందని జీవన్ రెడ్డి విమర్శించారు. 10 వేల రూపాయల రైతు బంధు ఇస్తామని చెప్పి, ఉన్న దానికి ఎసరు పెట్టారని మండిపడ్డారు.

బోనస్ ధర ఇస్తామని ఆశ చూపి, కనీసం అసలు ధర కూడా ఇవ్వకుండా రైతులను వంచిస్తున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉంటే, ఇప్పటికీ వేల టన్నులు కూడా కొనలేదని పైగా సంచికి మూడు కిలోల తరుగు తీస్తూ ఎకరానికి 3 వేల వరకు రైతుకు నష్టం చేస్తున్నరన్నారు.

ఏగ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ అని రికార్డుల్లో చూపిస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని, ఆన్లైన్ ప్రక్రియను వ్యవసాయ అధికారులే పూర్తి చేయాలి తప్ప, రైతులను ఇబ్బంది పెట్టకూడదని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందిస్తూ.. రెండు పిల్లర్లు క్రాక్ వస్తే కాంట్రాక్టర్ రిపేర్ చేస్తానన్నా ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ గురించి ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

ఫోర్త్ సిటీ కాన్సెప్ట్్ప జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని కానీ ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూడటం దారుణమన్నారు. L&T లాంటి సంస్థలే లాభాలు రావని వదిలేస్తుంటే, రేవంత్ రెడ్డి అందులో ఎందుకు దూరినట్టు? అని నిలదీశారు రేవంత్ రెడ్డి మూడు సంవత్సరాల పాలనలో ఇంకా ఎప్పుడు అనుభవానికి వస్తాడో అర్థం కావడం లేదంటూ, ఈ ప్రభుత్వానికి ఆయుష్షు సగం అయిపోయిందని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande