ఊసే లేని రాజీవ్ యువ వికాసం
తెలంగాణలో కొత్త ప్రభుత్వం అందిస్తానన్న పథకం కోసం కోటి ఆశలతో యువత ఎదురు చూస్తోంది.
Rajiv yuva vikas


వరంగల్, 09 మే (హి.స.)తెలంగాణలో కొత్త ప్రభుత్వం అందిస్తానన్న పథకం కోసం కోటి ఆశలతో యువత ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటి రాజీవ్ యువ వికాసం. ప్రభుత్వం కొలువు దీరిన సంవత్సరం తర్వాత నిరు ద్యోగుల నుంచి సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులను కోరింది. స్వయం ఉపాధి కోసం వివిధ యూనిట్లకు సరిపడా రుణాలు రూ. 50 వేల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2025 ఏప్రిల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడగానే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత కులం, ఆదాయ సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. సం తోషంగా తమ కులం, ఆదాయం, బ్యాంకు, రేషన్ తదితర వివరాలను పొందుపరిచి మండల పరిషత్ కార్యాయలయంలో సమర్పించారు. ఇకపై ప్రభుత్వం అందించే రుణంతో సొంత వ్యాపారం మొదలుపెట్టి జీవితంలో స్థిరపడాలన్న యువత ఆశలు సంవత్సరం గడిచినా రుణాలు రాకపో వడంతో వారి ఆశలు గాలిలో కలిసిపోయాయి. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ వాటి ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటి వరకు ఏ నాయకుడి నోట దాని ఊసే లేకపోయేసరికి తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందజేస్తే యువత స్వయం ఉపాధి తో జీవనం సాగించాలని కోరుకుంటున్నారు.

గత సంవత్సరం ఏప్రిల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి, మండలంలోని పలు గ్రామాల నిరుద్యోగ యువత నుంచి మొత్తం 1,041 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకైతే ప్రభుత్వం నుండి పథకానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం ఎస్సీ, మైనార్టీ వర్గాలకి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తోంది. వాటి అనంతరం రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తుందేమో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande