కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. తెలంగాణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bandi sanjay


హైదరాబాద్, 09 మే (హి.స.)తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదన్నారు.

హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ రాజధాని నుంచి తాము నిధులు తెస్తుంటే.. కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ సొమ్మును ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నడుపుకోవడానికి తెలంగాణ సొమ్మును వినియోగిస్తున్నారని ఆరోపించారు.

డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం మోదీ హైదరాబాద్ వస్తున్నారని వివరించారు. తమ నినాదం జై శ్రీరాం... జై తెలంగాణతోపాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే అని స్పష్టం చేశారు. జై శ్రీరాం.. జై తెలంగాణ నినాదాలతో పరేడ్ బహిరంగ సభ దద్దరిల్లుతుందని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాదిరిగా తనకు దోచుకోవడం తెలియదన్నారు. రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టడం తనకు తెలియదని చెప్పారు. డ్రగ్స్ తీసుకోవడం కూడా తమకు తెలియదని పేర్కొన్నారు.

m

బీఆర్ఎస్ ఏం చేసినా అధికారంలోకి రావడం కల్ల అని కుండ బద్దలు కొట్టారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అని ఆయన జోస్యం చెప్పారు. మోదీ సభ తరువాత రాష్ట్రంలో జరగబోయేది చూడండంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మే10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande