
హైదరాబాద్, 09 మే (హి.స.)
జనగణనలో బీసీ కులాల గణన చేపట్టాలన్న డిమాండ్ తో ప్రభుత్వ సలహాదారు, మాజీ రాజ్యసభసభ్యులు వి.హనుమంతరావు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అంబర్పేట లోని తన నివాసంలో శనివారం దీక్ష ప్రారంభించారు. రాజకీయ పార్టీలకి అతీతంగా బీసీల అభ్యున్నతికి, బీసీ జనాభా ప్రతిపాదికంగా న్యాయం జరగాలంటే జనగణనలో బీసీ జనాభా కూడా లెక్కించాలి వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని ఈ విషంలో ఈ నెల 8వ తేదీలోపు స్పష్టత ఇచ్చిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటకు రావాలని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వీహెచ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇవాళి నుంచి ఆయన దీక్షకు దిగారు. తాను ప్రధానికి పలుమార్లు లేఖలు రాసినా సరైన స్పందన లేకపోవడంతో దీక్ష చేపట్టినట్లు ఈ సందర్భంగా వీహెచ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు