ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి: వనపర్తి జిల్లా కలెక్టర్
ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి: వనపర్తి జిల్లా కలెక్టర్
Collector collector


వనపర్తి, 09 మే (హి.స.)

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గోపాల్పేట మండలంలోని నర్సింగాయిపల్లి గ్రామంలో మెప్మా(పట్టణ మహిళా సమాఖ్య) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రికార్డులు, ధాన్యం నమోదు రిజిస్టర్లను, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం తూకం చేయడంలో, ధాన్యాన్ని మిల్లులకు తరలింపు చేయడంలో, విక్రయించిన ధాన్యం చెల్లింపుల ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. ప్యాడి క్లీనర్ల ద్వారా ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా శుభ్రం చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అకాల వర్షాలు కురిస్తే రైతులకు ఇబ్బంది కలగకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande