సువేందు అధికారికి శుభాభినందనలు: ఏపీ సీఎం చంద్రబాబు
సువేందు అధికారికి శుభాభినందనలు: ఏపీ సీఎం చంద్రబాబు
Chandra Babu Naidu


అమరావతి, 09 మే (హి.స.)

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవీ బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారి మంత్రి మండలి సభ్యులకు కూడా చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, ఆయన కన్న వికసిత్ భారత్ స్వప్నం స్ఫూర్తిగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో అధికారం చేపట్టిన సువేందు అధికారి ప్రభుత్వం విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చంద్రబాబు వివరించారు.

ఇవాళ కోల్ కతాలో జరిగిన సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. తాజాగా, సోషల్ మీడియాలోనూ బెంగాల్ నూతన సీఎంకు శుభాభినందనలు తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande