ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాలి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy


హైదరాబాద్, 09 మే (హి.స.)

పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాలని తెలిపారు.

మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం : హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని మల్టీ ట్రాన్స్పోర్టు సిస్టమ్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్కింగ్ ఇబ్బందులు అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

అభివృద్ధిని 3 భాగాలుగా విభజించుకున్నాం : తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు. క్యూర్, ప్యూర్, రెర్గా అభివృద్ధిని 3 భాగాలుగా విభజించుకున్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు క్యూర్ ఏరియాను సర్వీస్ సెక్టార్గా గుర్తించామని అన్నారు. ఓఆర్ఆర్ బయట, ఆర్ఆర్ఆర్ లోపల ఉన్న ప్యూర్ ఏరియాను తయారీ రంగంగా గుర్తించామని, ఆర్ఆర్ఆర్ బయట ఉన్న రెర్ ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్గా గుర్తించామని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande