ధాన్యం కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతుల మెరుపు ధర్నా
ధాన్యం కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతుల మెరుపు ధర్నా
Farmers protest


మహబూబ్నగర్, 09 మే (హి.స.)

ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకుందామని చూస్తే కొనుగోలు చేయడానికి అధికారులు నిరాసక్తత చూపడం గన్ని బ్యాగుల కొరత గోదాములు స్టాక్ పాయింట్లు నిండడంతో రైతులకు పెను శాపంల మారింది. గత నెల రోజుల నుంచి ధాన్యం జడ్చర్ల మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకుందామని చూస్తే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు తమను పట్టించుకోవడంలేదని ఇంకా ఎన్ని రోజులు తమ ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మార్కెట్ యార్డ్ ముందు ఉన్న 167వ జాతీయ రహదారిపై మెరుపు ధర్నాకు దిగారు.

మార్కెట్ అధికారులు రైతుల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని ధాన్యం కొనుగోలు చేయాలంటే మీకంటే 20 రోజుల ముందు వచ్చిన వారు ఉన్నారని కొన్న ధాన్యాన్ని ఏం చేయాలని తమ వద్ద స్టాక్ పాయింట్లో అన్ని నిండిపోయాయని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆరోపించారు. వ్యవసాయ ట్రాక్టర్లలో వడ్ల సంచులు నింపి ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని ఆ ధాన్యం అమ్మితే వచ్చే డబ్బులు ట్రాక్టర్ల అదే కట్టడానికి కూడా సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెట్ అధికారులు రైతుల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని ధాన్యం కొనుగోలు చేయాలంటే మీకంటే 20 రోజుల ముందు వచ్చిన వారు ఉన్నారని కొన్న ధాన్యాన్ని ఏం చేయాలని తమ వద్ద స్టాక్ పాయింట్లో అన్ని నిండిపోయాయని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆరోపించారు.

వ్యవసాయ ట్రాక్టర్లలో వడ్ల సంచులు నింపి ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని ఆ ధాన్యం అమ్మితే వచ్చే డబ్బులు ట్రాక్టర్ల అదే కట్టడానికి కూడా సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల మెరుపు ధర్నాతో 167 వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సీజన్ కావడంతో పెళ్లిళ్లకు వెళ్లేవారు పలువురు వరుడు, వధువులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను సిగ్నల్ గడ్డ వద్దని ఆపి దారి మళ్ళించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande