కాన్వొకేషన్ కోసం వెళ్లి.. అమెరికాలో లక్కిరెడ్డిపల్లె విద్యార్థి మృతి
కాన్వొకేషన్ కోసం వెళ్లి.. అమెరికాలో లక్కిరెడ్డిపల్లె విద్యార్థి మృతి
lakkireddypalle-student-dies-in-america-after-going-for-convocation


లక్కిరెడ్డిపల్లె, , 09 మే (హి.స.)

గోల్డెన్ గేటు యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకుని కాన్వొకేషన్ అందుకున్న మండలానికి చెందిన మొహమ్మద్ కుమేల్ షేక్ (28) గుండెపోటుతో మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన స్టాంప్ రైటర్ షేక్ తాజ్ కుమారుడు మొహమ్మద్ కుమేల్ షేక్ అమెరికాలోని గోల్డెన్ గేటు యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. రాత్రి కళాశాలలో కాన్వొకేషన్ అందుకుని ఇంటికి వెళ్లాడు. తెల్లారేసరికి గుండెపోటుతో మృతి చెందాడని అమెరికా నుంచి ఫోన్ వచ్చిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికొచ్చిన ఒకే ఒక్క కుమారుడు మృత్యువాత పడడంతో ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande