ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే నాపై 34 కేసులు': మన్నె క్రిశాంక్
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే నాపై 34 కేసులు': మన్నె క్రిశాంక్
Brs


సంగారెడ్డి, 09 మే (హి.స.) తెలంగాణ ప్రజలకు నేను ప్రమాణం చేసి చెబుతున్నా నేను తప్పు చేయలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే నాపై 34 కేసులు పెట్టారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. శనివారం కంది సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. 16 రోజులుగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తూ కంది సెంట్రల్ జైల్లో ఉన్న క్రిశాంక్ విడుదలైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నాపై ఉన్న 34 కేసులు ప్రజలు పెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు కావాలనే పెట్టారు. నాకు నేర చరిత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు. మేము తెలంగాణ ఉద్యమకారులం.

ప్రశ్నించడం మా హక్కు అని ఆయన అన్నారు. అంగన్వాడీలకు అందించే ఫోన్లలో అవినీతి జరిగిందని సిపిఐ ఎంక్వయిరీ కోరానని, యూనివర్సిటీలో చెట్లను నరకడాన్ని ప్రశ్నించినందుకు ఇలా రకరకాలుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే నా పై కేసులు పెట్టారని అన్నారు. ఫోన్, ఈమెయిల్ పాస్వర్డ్లు అడుగుతున్నారు. వైఫై పాస్వర్డ్, ఈమెయిల్, నా ఫోన్ పాస్వర్డ్ కావాలని పోలీసులు అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నేరాలు జరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయకుండా, లా అండ్ ఆర్డర్ను కాపాడకుండా ప్రతిపక్షాలను వేధిస్తున్నారు అని మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande