ఎరువుల విక్రయాలపై పటిష్టనిఘా
ఎరువుల విక్రయాలపై పటిష్టనిఘా
surveillance-on-fertilizer-sales-1


కర్నూలు, 09 మే (హి.స.) : కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న యూరియాను ఎరువు తయారీ సంస్థలు, డీలర్లు పెద్ద ఎత్తున పక్కదారి పట్టిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో యూరియా, డీఏపీ తదితర ముఖ్యమైన ఎరువుల అమ్మకాలు ఎంత? వాస్తవంగా రైతులు వినియోగిం చింది ఎంత? పక్కదారి పట్టింది ఎంత? అనే వాటిపై నంద్యాల, కర్నూలు, ఏలూరు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ బృందాలు అకస్మిక తనిఖీలు చేపట్టాయి.

నంద్యాలలో గత మూడు రోజులుగా కేంద్ర బృందాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ బృందాలు డీలర్ల గోదాములు, ఎరువుల ఉత్పత్తి సంస్థల గోదాముల్లో తనిఖీ చేస్తున్నట్లు అధికార వరా ్గలు తెలిపాయి. టాస్క్ఫోర్స్ బృందాలు క్షేత్ర స్థాయి లో విరివిగా తనిఖీలు, అక్రమాలకు ఆస్కారం ఉండే ప్రదే శాల్లో సోదాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశా లు జారీ చేసింది. దాదాపు 80 శాతం సబ్సిడీ అంది స్తున్న యూరియాతో పాటు మిగిలిన ఎరువులు, డీఏపీ, పొటా ష్, కాంప్లెక్స్ ఎరువులను రైతులకు ప్రభుత్వం అంది స్తోంది. ఈ ఎరువులను తప్పనిసరిగా ఈ పోస్ యం త్రాల ద్వారానే రైతులకు అందించాలని కేంద్ర ప్రభు త్వం గత ఐదారు సంవత్సరాలుగా ఆదేశాలు జారీ చేసినా డీలర్లు మాత్రం వివిధ కారణాలతో ఈ పోస్ యంత్రాలను వాడకుండా మాన్యువల్గా రైతుల వేలి ముద్రలతో ఎరువులను విక్రయిస్తున్నారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఎరువులు ముఖ్యంగా యూరియా బయటి ప్రాంతాలకు తరలిపోతున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టాస్క్ఫోర్స్ బృందాలు నిర్ధారిస్తున్నాయి.

ఎరువుల విక్రయాలు, వినియోగం, కేటాయింపులకు సంబంధించి సరైన లెక్కలు రికార్డుల్లో లేకపోవడంతో ప్రభుత్వం ఎరువుల వినియోగాన్ని గాడిలో పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎరువుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిందని, ఇందులో భాగంగానే ఇకపై ఎరువుల అమ్మకాలు, ఖచ్చితంగా ఈ నెల 20 నుంచి ఈ పోస్ మిషన్ ద్వారా జరపాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande