
నార్పల (అనంతపురం), 09 మే (హి.స.)
: మండల పరిధిలోని తుంపెర గ్రామానికి చెందిన కళావతి తనకున్న నాలుగు ఎకరాల పొలంలో రకరకాల కూరగాయలు, పండ్లు సాగు చేసుకుంటూ భార్యా, భర్త పిల్లలతో జీవనం సాగిస్తోంది. పండిన పంటకు మంచి గిట్టుబాటు ధర పలికితే పొలం వద్దనే పంటను అమ్ముతామని కొన్ని రకాల కూరగాయలు, పండ్లు ఒక్కసారిగా రావు కాబట్టి ఏ రోజు కా రోజు పండిన కూరగాయలు పండ్లు తక్కువ మోతాదులో ఉంటే ద్విచక్ర వాహనంలోను ఎక్కువ మోతాదులో ఉంటే సొంత ఆటోలో వేసుకుని పండిన పంటను తుంపెర నుండి కళావతినే సొంతంగా ఆటో నడుపుకుంటూ నార్పలకు వచ్చి మెయిన్ రోడ్డు లోనూ పలు వీధుల్లోనూ తిరిగి పంటను అమ్ముకొని వెళుతుంది.
కళావతిని చూసిన పలువురు పురుషులతో పాటు వాహనాన్ని నడుపుతూ వ్యాపారం చేస్తూ కష్టపడి పని చేసుకొని కుటుంబ పోషణ చేసే మహిళలకు కళావతి ఆదర్శంగా నిలుస్తోంది అని చాలామంది మహిళలు తమ చేత ఏమీ కాదంటూ కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని అలాంటివారు కళావతిని చూసి ధైర్యంగా ముందడుగు వేయాలని అంటున్నారు..
ఈ వ్యాపారం ఎప్పటినుంచి చేస్తున్నారని కళావతిని అడగగా కుటుంబం మొత్తం కష్టపడి పండించిన పంటను అతి తక్కువ ధరలకు దళారులకు అమ్ముకోలేక కొన్ని సంవత్సరాల నుండి పండిన పంటను ద్విచక్ర వాహనంలో కానీ ఆటోలో కానీ తీసుకుని వచ్చి నార్పలలో అమ్ముతున్నామని తాన వద్ద కూరగాయలు కానీ పండ్లు గాని తాజాగా ఉంటాయని నార్పలలో చాలామంది తన వద్దనే కొనడానికి ఇష్టపడతారని కళావతి అంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV