
కామారెడ్డి, 09 మే (హి.స.)
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో వరుసగా జరుగుతున్న చిరుతపులి దాడులు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 5 నెలల వ్యవధిలో ఆరు సార్లు దాడులకు పాల్పడిన చిరుత 8 పశువులను హతమార్చడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలో ఉన్న లింగంపేట మండలంలో అడవులు దట్టంగా ఉండడంతో చిరుతపులులు తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకొని పశువుల మందలపై దాడి చేస్తున్నాయి. లింగంపేట మండలంలోని మోతే, గాంధీనగర్, బూరుగిద్ద, లింగంపల్లి, బట్టిపగడ్డ తండా, ఐలాపూర్, ఎల్లమ్మ తండా, నల్లమడుగు తండా, మెంగారం, కొట్టాల్ లక్ష్మాపూర్, తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ అడవి ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉంది. రైతులు తమ వ్యవసాయ పంట పొలాల వద్ద ఆవులు, పాడి గేదెలు, దూడలను కట్టేసి ఉంచడంతో చిరుతపులులు రాత్రి వేళలో వచ్చి వాటిని హత మారుస్తున్నాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
నెలకొందని చిరుత పులుల సంచారంతో అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదం పొంచి ఉందని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇకనైనా అటవీశాఖ అధికారులు స్పందించి బోన్ ఏర్పాటుచేసి చిరుతలను బంధించి జూ పార్క్ తరలించాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు