
అమరావతి, 10 జూన్ (హి.స.)
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన మన్నెం వెంకట శ్రీకాంత్ అనే భక్తుడు బుధవారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 10 లక్షలను విరాళంగా అందించారు. ఈ మేరకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ