తెలంగాణలో విచిత్ర వాతావరణం.. మధ్యాహ్నం ఎండ, సాయంత్రానికి వర్షం
తెలంగాణలో విచిత్ర వాతావరణం.. మధ్యాహ్నం ఎండ, సాయంత్రానికి వర్షం
Weather


హైదరాబాద్, 12 జూన్ (హి.స.)

తెలంగాణలోకి రుతుపవనాలు

ప్రవేశించాయి. దీంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం పూట ఎండలు దంచికొడుతూ ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ రోజు కూడా కొన్ని జిల్లాలకు వర్షసూచన ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం నుండే పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. అంతే కాకుండా కొమురంభీం అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోనూ మధ్యాహ్నం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనావేశారు. నల్గొండలో ఉదయం 8గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆ తరవాత మెల్లిగా తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఎండల నుండి కాస్త ఉపశమనం లభిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande