కేసీఆర్ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్
హైదరాబాద్, 12 జూన్ (హి.స.)బీజేపీకి దగ్గరిగా ఉన్న వాళ్ళే మీనాక్షి నటరాజన్ వ్యవహారం బయటపెట్టారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘‘ఎవరు బయటపెట్టారో కాంగ్రెస్ వాళ్ళకి తెల
కేసీఆర్ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్


హైదరాబాద్, 12 జూన్ (హి.స.)బీజేపీకి దగ్గరిగా ఉన్న వాళ్ళే మీనాక్షి నటరాజన్ వ్యవహారం బయటపెట్టారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘‘ఎవరు బయటపెట్టారో కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వాళ్లే ఓడ గొట్టారు. కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ విషయం బయట పెట్టిన బ్లాక్ షిఫ్ ఎవరో తేల్చండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో ప్లేస్‌కి పరిమితమవుతుంది’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

‘‘వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి బీజేపీనే. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేయడం మాకు కలిసొచ్చింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి నాకు పంచాయితీలు లేవు. విధానపరమైన నిర్ణయాలపై మాత్రమే పంచాయతీ. రేవంత్‌రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా చేస్తుంది. రేవంత్ నిర్ణయాలు బీఆర్‌ఎస్‌కు మంచిది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande