
హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
సైఫాబాద్లోని మింట్ మ్యూజియాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో నాణేలు, వాటి తయారీ విధానం, ఉపయోగించిన పరికరాలను బుధవారం ఆయన పరిశీలించారు. మ్యూజియం చరిత్ర, నాణేల తయారీ విధానం, తయారీకి వినియోగించిన పరికరాలు, వివిధ రకాల నాణేల విశిష్టతలను భారత ప్రభుత్వ మింట్ హైదరాబాద్ చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ రమాకాంత్ దీక్షిత్ గవర్నర్కు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్