జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన విద్యార్దిని ఎంపీపీ జె విజయకుమార్ సన్మానించారు
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) గట్టు: జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన విద్యార్థిని గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ బుధవారం ఘనంగా సత్కరించారు. గట్టు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కురువ తిరుమలేష్ వట్టెంలోని నవోదయ విద్యాలయ ఆరో తరగతిలో సీటు
జవహర్ నవోదయ విద్యాలయంలో  సీటు సాధించిన విద్యార్దిని ఎంపీపీ జె విజయకుమార్ సన్మానించారు


హైదరాబాద్, 10 జూన్ (హి.స.)

గట్టు: జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన విద్యార్థిని గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ బుధవారం ఘనంగా సత్కరించారు. గట్టు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కురువ తిరుమలేష్ వట్టెంలోని నవోదయ విద్యాలయ ఆరో తరగతిలో సీటు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తన స్వగృహంలో విద్యార్థికి పూలమాల వేసి అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరి, తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగన్న, దానప్ప, మూల శివప్ప, రాంరెడ్డి, ధర్మారెడ్డి, కిష్టప్ప, బషీర్ మియా తదితరులు విద్యార్థికి అభినందనలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande