
అమరావతి, 10 జూన్ (హి.స.)
మాధవధార, కొత్త వాహనాలు కొనుగోలు చేసే చోదకులకు ఇక నుంచి 24 గంటల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ జరగనుంది. ఈ విధానం ఈనెల 6వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. షోరూంలో వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలరు తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. గతంలో రవాణాశాఖ అధికారుల జాప్యం కారణంగా రోజుల తరబడి శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. దీనిపై ఐవీఆర్ఎస్లో ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రవాణాశాఖ అధికారులతో మాట్లాడి వెంటనే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు వాహన పోర్టల్లో మార్పులు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ