
భువనగిరి, 10 జూన్ (హి.స.)
: యాదాద్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారికి నిత్య పూజలు వైభవంగా జరిగాయి. బుధవారం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలు, అష్టోత్తర శతనామాలతో పాదపద్మార్చన సేవ జరిగింది. భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్