విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్ ఎం ఎస్ మెల్ట్ షాపు 1 లో ఉత్పత్తి నిలిచిపోయింది
అమరావతి, 10 జూన్ (హి.స.) విశాఖ స్టీల్ప్లాంటులోని ఎస్ఎంఎస్ (స్టీల్ మెల్ట్షాప్-1) లో సోమవారం సంభవించిన ప్రమాదం వల్ల ఆ విభాగంలో ఉత్పిత్తి నిలిచిపోయింది. అక్కడ విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు భయపడిపోతున్నారు. ఎస్ఎంఎస్లోని సీసీడీ (కంటిన్యూ కాస్టింగ్ వ
vsp


అమరావతి, 10 జూన్ (హి.స.)

విశాఖ స్టీల్ప్లాంటులోని ఎస్ఎంఎస్ (స్టీల్ మెల్ట్షాప్-1) లో సోమవారం సంభవించిన ప్రమాదం వల్ల ఆ విభాగంలో ఉత్పిత్తి నిలిచిపోయింది. అక్కడ విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు భయపడిపోతున్నారు. ఎస్ఎంఎస్లోని సీసీడీ (కంటిన్యూ కాస్టింగ్ విభాగం)లో ఆరు మెషీన్లు ఉంటాయి. అందులో ఐదు నిత్యం పనిచేస్తుంటాయి. ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ‘బి’ షిఫ్ట్లో 2, 3, 4 మెషీన్లు పనిచేస్తున్నాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో 2వ మెషీన్ వద్ద జరిగిన ప్రమాదం వల్ల మొత్తం విభాగంలోని కేబుళ్లు, ఇతర యంత్ర సామగ్రి ధ్వంసమయ్యాయి. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. మంగళవారం రాత్రి వరకు ఈ విభాగంలో ఉత్పత్తి పునఃప్రారంభం కాలేదు. ఆ మెషీన్ల వద్ద పని చేసేందుకు ఉద్యోగులు సుముఖంగా లేరు. ఇదిలా ఉండగా ఈ విభాగంలో ఉత్పత్తి నిలిచిపోవడంతో మిగిలిన విభాగాల్లోనూ ఉత్పత్తి ప్రక్రియపై ప్రభావం పడుతోంది. దీంతో సంస్థకు కోట్ల రూపాయల్లో నష్టం వచ్చే అవకాశం ఉందని కార్మికులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande