
మార్కాపురం, 10 జూన్ (హి.స.)
, హత్య కేసులో మార్కాపురం విఐ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం రాజుపాలెంకు చెందిన కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బుధవారం ఈ కేసు విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
దీంతో ఈ కేసులో నిందితులు చల్లా వెంకటేశ్వర్లు, చల్లా వెంకట నరసింహం, సన్నెబోయిన కృష్ణయ్య, చల్లా శ్రీను, లోమడ హరిబాబు, చల్లా అనిల్, చలివేంద్ర ప్రసాద్, చల్లా రమేష్, చల్లా నాగయ్య, దోసపాటి వెంకటయ్య, దోసపాటి శ్రీనివాసులు, జూపల్లి శివయ్య, చల్లా రవిలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. రాజుపాలెం గ్రామంలో బొడ్డు రాయి విషయంలో వ్యక్తుల మధ్య ఘర్షచోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కంచర్ల శ్రీనును దారి కాచి 13 మంది హత్య చేశారు. ఈ నేరం రుజువు కావడంతో నిందితులకు కోర్టు శిక్ష విధించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ