
భద్రాచలం, 10 జూన్ (హి.స.)
పట్టణం ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి.గణేశ్ , ఈఎస్ కె.తిరుపతి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై సీహెచ్ శ్రీహరిరావు సిబ్బందితో కలిసి కూనవరం నుంచి భద్రాచలం వైపునకు వెళ్లే రోడ్డుపై ఇసుక రీచ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న మూడు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. మొదటి బైక్లో 8.300 కేజీలు, మరో బైక్లో 3.100 కేజీలు, మూడో వాహనంలో 2.200 కేజీల ఎండు గంజాయి పట్టుబడింది. నిందితులు మల్కాన్గిరి, ఒడిశా నుంచి హైదరాబాద్కు, సీలేరు నుంచి నల్గొండకు, సీలేరు నుంచి కర్నూలుకు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. మూడు వాహనాలు, నాలుగు సెల్ఫోన్లతోపాటు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పి. రాజు, రమేశ్ బాబు, వెంకన్న, ప్రసన్నకుమార్, ఉపేందర్ పాల్గొన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 కు తెలియజేయాలని ఎస్సై సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్