సిద్దాపూర్ రిజర్వాయర్ కు మరో 200 కోట్లు. మంజూరు
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) మహదేవ్పూర్: కాంగ్రెస్ పాలనలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయని, బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వాళ్ల హయాంలోనే కూలిపోయిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ) అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల పరిస్థిత
సిద్దాపూర్ రిజర్వాయర్ కు మరో 200 కోట్లు. మంజూరు


హైదరాబాద్, 10 జూన్ (హి.స.)

మహదేవ్పూర్: కాంగ్రెస్ పాలనలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయని, బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వాళ్ల హయాంలోనే కూలిపోయిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ) అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల పరిస్థితి ఏమైందో అందరూ గమనించాలన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన.. జాకోరా, చందూర్ ఎత్తిపోతలను ప్రారంభించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ను పరిశీలించారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. సవరించిన అంచనాల మేరకు సిద్ధాపూర్ రిజర్వాయర్కు మరో రూ.200 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. కాలువలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande