వీ బీ గ్రామ్ జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రూ.7,707,21 కోట్ల .తాత్కాలిక.కేటాయింపు
అమరావతి, 10 జూన్ (హి.స.) ,VB-GRAM-G పథకం కింద ఆంధ్రప్రదేశ్కు రూ.7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలోనే మూడవ అత్యధిక నిధులను ఏపీ పొందిందని తెలిపారు. ఇది పారదర్శక పాలన, సమర్థవంతమైన అమలు పట
వీ బీ గ్రామ్ జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రూ.7,707,21 కోట్ల .తాత్కాలిక.కేటాయింపు


అమరావతి, 10 జూన్ (హి.స.)

,VB-GRAM-G పథకం కింద ఆంధ్రప్రదేశ్కు రూ.7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలోనే మూడవ అత్యధిక నిధులను ఏపీ పొందిందని తెలిపారు. ఇది పారదర్శక పాలన, సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు ఓ బలమైన నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ మద్దతు గ్రామీణ పరివర్తనను వేగవంతం చేస్తుందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, జీవనోపాధిని మెరుగుపరుస్తుందని చెప్పారు.

ఏపీ, దేశాభివృద్ధి కోసం కఠోర శ్రమతో ఊపిరి పోస్తున్న రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు ఇది మరింత మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని పవన్ అన్నారు. దూరదృష్టితో కూడిన నాయకత్వం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రధాన మంత్రికి పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్పై నిరంతర మద్దతు, నమ్మకాన్ని ఉంచినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌహాన్ శివరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, వర్గాలకు అభివృద్ధి వనరులు చేరేలా చూడటంలో పారదర్శకమైన నిష్పాక్షికమైన విధానాన్ని అనుసరిస్తున్న భారత ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande