
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) తుమ్మిడిహట్టి ప్రాజెక్టును అడ్డుకున్నది
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయమై తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఆనాడు మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడున్నది పృథ్విరాజ్ చౌహాన్ సీఎం, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. వారు (పృథ్విరాజ్ చౌహాన్) స్వయంగా లేఖ రాశారు. పృథ్విరాజ్ చౌహాన్ అక్టోబర్ 15 2013లో లేఖ రాశారన్నారు.
ఈ ప్రాజెక్టు మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నరు. దీంట్లో 152 మీట్లర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్లో నిర్మిస్తే దాదాపు మా చంద్రాపూర్లో 22 గ్రామాలు మునుగుతాయి. గడిచౌరిలో 8 గ్రామాలు, దాదాపు 2 వేల హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేం అనుమతి ఇవ్వం అని చెబుతూ.. మీరు తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తు మీరు టెండర్లు పిలుస్తున్నరు.. కాంట్రాక్టర్లులిస్తున్నరు. అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ పనులన్ని ఆపండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి అనుమతి ఇవ్వం అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని వినోద్ కుమార్ అన్నారు.
152 మీటర్ల ఎత్తులో మీరు బ్యారేజ్ కడితే మా గ్రామాలు మునిగిపోతాయని, అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదని పృథ్వీ రాజ్ చౌహాన్ లేఖ లేఖలో పేర్కొన్నారు. ఇది ఒక పనికిమాలిన చర్య అని, డబ్బులు వృథా చేస్తున్నారని, ఈ నిర్మాణం ఆపకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ పృథ్వీ రాజ్ చౌహాన్ రాశారని వినోద్ కుమార్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు