బ్యాంకులు. ఫైనాన్స్ సంస్థల్లో ఇంటి.దొంగల బెడద
జంగారెడ్డిగూడెం, 10 జూన్ (హి.స.) చింతలపూడి, జంగారెడ్డిగూడెం పట్టణం, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో ఇంటి దొంగల బెడద పెరిగింది. అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని కొన్ని చోట్ల బ్యాంకర్లే కాజేస్తున్నారు. ఈ అక్రమంలో అప్రైజర్లు కీలకంగా ఉంటున్నారు. 2
బ్యాంకులు. ఫైనాన్స్ సంస్థల్లో ఇంటి.దొంగల బెడద


జంగారెడ్డిగూడెం, 10 జూన్ (హి.స.) చింతలపూడి, జంగారెడ్డిగూడెం పట్టణం, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో ఇంటి దొంగల బెడద పెరిగింది. అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని కొన్ని చోట్ల బ్యాంకర్లే కాజేస్తున్నారు. ఈ అక్రమంలో అప్రైజర్లు కీలకంగా ఉంటున్నారు. 2023లో జంగారెడ్డిగూడెం బస్టాండ్ వెనుక ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గిల్టు నగలతో సుమారు రూ.1.50 కోట్లు దారి మళ్లించారు. అంతర్గత తనిఖీలో ఈ విషయం బయటపడింది. స్థానిక ఐసీఐసీఐ బ్యాంకులో నగలు, ఎఫ్డీలకు సంబంధించి అవకతవకలు జరిగాయి. ఈ క్రమంలో మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఐఐఎఫ్ఎల్ బ్యాంకులోనూ తాకట్టు నగలను దారి మళ్లించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు అధికారి పత్తా లేరు. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరో కుంభకోణం. ఇక్కడ తాకట్టు పెట్టిన కొందరి నగలు పూర్తిగా మాయం కాగా.. మరికొందరివి తగ్గాయి. దీంతో తమ బంగారం ఉందో లేదో తెలుసుకునేందుకు ఖాతాదారులు బ్యాంకు వద్ద పడిగాపులు పడుతున్నారు. మోసాలకు అప్రైజర్ సూత్రధారిగా అనుమానిస్తున్నారు. మోసపోయిన వారిలో బంగారు రుణాలు రెన్యువల్కు వచ్చిన వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

చింతలపూడిలో అలా..తాకట్టు నగలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేసేందుకు వచ్చిన ఆడిటరే దొంగగా మారిన ఉదంతం చింతలపూడిలో జరిగింది. 2025 సెప్టెంబరులో చింతలపూడి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో ఆడిటింగ్కు వచ్చిన ఆడిటర్ ఒకరు రూ.కోట్లు విలువైన సుమారు మూడు కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకోవడంతో నగల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande