
హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు తావులేదని, నేరగాళ్ల పట్ల ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలన, పోలీస్ విభాగాorganization పునర్వ్యవస్థీకరణపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతమొందిందని డీజీపీ ప్రకటించారు. మారుతున్న కాలం, అవసరాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థలో మార్పులు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగానే అటవీ ప్రాంతాల్లో పోరాడేందుకు ఏర్పాటైన ఎలైట్ ఫోర్స్ ‘గ్రేహౌండ్స్’ విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వెల్లడించారు. అందులోని సుమారు 1700 మంది సిబ్బందిని ప్రస్తుతం అత్యవసరంగా మారిన కొత్త విభాగాలైన సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ వంటి విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనందర్ పేర్కొన్నారు. యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, డ్రగ్స్ నెట్వర్క్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. టెక్నాలజీని వాడుకుంటూ అమాయకులను దోచుకుంటున్న సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్ సిబ్బందికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. సైబర్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. స్థానికంగా శాంతిభద్రతలను కాపాడటంలో, క్షేత్రస్థాయిలో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్న ఆదిలాబాద్ జిల్లా పోలీసులను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..