
అమరావతి, 10 జూన్ (హి.స.)
ఐరాల: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. తొలుత వారిని ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ ఈవో పెంచల కిషోర్ .. న్యాయమూర్తికి స్వామివారి చిత్రపటంతోపాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈవో రవీంద్రబాబు, ప్రొటోకాల్ ఏఈవో ధనపాల్, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీనాయుడు, చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు వారి వెంట ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ