ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నిజామాబాద్, 10 జూన్ (హి.స.) ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా భిక్కనూరులో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. గ్రామస్థుల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథక
Collector


నిజామాబాద్, 10 జూన్ (హి.స.)

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా భిక్కనూరులో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. గ్రామస్థుల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించి వినతిపత్రాలు స్వీకరించారు. పూరిగుడిసెలను గుర్తించి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.

ఎస్ఐర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అర్హులైన యువతను ఓటరు జాబితాలో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జన సంరక్షణ – మన సంరక్షణ కార్యక్రమం కింద 36 వేల కందకాలు తవ్వినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం, ఆయిల్పామ్ సాగు విస్తరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ప్రయాణంలో హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఎల్ఎస్పీ నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్ ఎం.వి. గిరి, సర్పంచ్ రేఖ, జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande